Crime News: ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లతో షూటింగ్‌లపై నిషేధం ఉన్నప్పటికీ ఓ యూట్యూబర్ డ్రోన్ ఎగురవేసి షూట్ చేసి విజువల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆలయ అభివృద్ధి పనులు కూడా వీడియోలో రికార్డు అయ్యాయి. పట్టపగలు ఆలయ పరిసరాల్లో డ్రోన్‌తో షూట్ చేశాడు.
ఆలయంపై డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరణ చేశాడు. ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ అంశాన్ని వెలుగులోకి వచ్చింది. దీంతో ఆలయ అధికారులు స్పందించారు. దానివల్ల ఆలయ భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆలయ ఏఈవో యూట్యూబర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.
Crime News: ఆలయ పరిసరాల్లో డ్రోన్లతో షూటింగ్‌లపై నిషేధం ఉన్నప్పటికీ ఓ యూట్యూబర్ డ్రోన్ ఎగురవేసి షూట్ చేసి విజువల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆలయ అభివృద్ధి పనులు కూడా వీడియో రికార్డు అయ్యాయి. పట్టపగలు ఆలయ పరిసరాల్లో డ్రోన్‌తో షూట్ చేశాడు. నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.