Uppal: హైదరాబాద్ లో రాత్రి వేళల్లో కొత్త ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది.. రోడ్డు మధ్యలో బైక్‌లు అప్పి, స్పీకర్లు పెట్టి, కేక్ కట్ చేస్తూ బర్త్‌డే సెలబ్రేషన్స్! ఇది చూడటానికి గేమ్ ఛేంజర్ ట్రెండ్‌లా అనిపించినా, వాస్తవానికి ఇది ట్రాఫిక్‌కు ముప్పుగా, ఇతర వాహనదారులకు చిక్కుగా మారుతోంది. తాజాగా ఉప్పల్‌లో జరిగిన సంఘటన మరోసారి ఈ విధానం ఎంత ప్రమాదకరమో చాటిచెప్పింది.
అర్థరాత్రి సమయంలో రోడ్డుకు అడ్డంగా బైక్‌లను అప్పి, తలపై కిరీటం, మెడలో పూల మల్ల వేసుకుని ఓ యువకుడి బర్త్‌డే వేడుకల్లో మునిగిపోయిన యువకులు, పక్కనే ఉన్న పోలీసుల రెక్కీకి బుక్కయ్యారు. రోడ్డును బ్లాక్ చేసే హక్కు ఎవరు ఇచ్చారు? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించిన పోలీసులు, వారి పేర్లు, వివరాలను నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.
పుట్టినరోజు ఒక్కొక్కరికి స్పెషల్. కానీ ఆ ఆనందం ఇతరులకు ఇబ్బందిగా మారితే, అది పండుగ కాదు. బాధకారక ఘటన అవుతుంది. బైక్‌కు లైసెన్స్ లేకపోవడం, హెల్మెట్ లేకుండా తిరగడం, ఆర్డర్ చేసిన కేక్ కోసం రోడ్డు అడ్డుకోవడం. ఇవన్నీ చట్టానికి విరుద్ధం. మీకు ఏదైనా అయితే, తల్లిదండ్రులు ఎవరి అండ లేకుండా పోతారు అంటూ పోలీసులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Harish Rao: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ.. మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
ఈ ఘటనతో పోలీసులు క్లారిటీగా చెబుతున్నారు. ఇకపై రోడ్డుపై బర్త్‌డే వేడుకలు చేయడం అంటే చట్టం ఉల్లంఘించినట్లే. ఒకవేళ తిరిగి ఇలాంటి హంగామా చేసినట్లయితే, కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
ఫ్యాషన్‌తో ఫన్న్ ఓకే.. కానీ రూల్స్ మిస్ అయితే ఫైన్ తప్పదు!
వాడుకైన మాటే.. జాగ్రత్త పడని ఆనందం, జ్ఞాపకం కాకుండా శిక్షగా మిగిలిపోతుంది. సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కాదు.. కానీ దానికి ఒక హద్దు, బాధ్యత ఉండాలి. ముఖ్యంగా ప్రజలకంతా ఉపయోగపడే రోడ్లను అడ్డగొట్టి పార్టీలు చేసుకోవడం అనేది సామాజిక బాధ్యతల పట్ల తీసిపారేసిన దృష్టిని చూపుతుంది.
ఇకపై యువత ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, సెల్ఫ్ డిసిప్లిన్, సెంసిబిలిటీ కూడా కావాలి.
జ్ఞాపకాల బర్త్‌డే కావాలంటే.. జాగ్రత్తతో జరుపుకోండి!
