Choreographer Krishna: టాలీవుడ్ డ్యాన్స్ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కోరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ఇప్పుడు పోలీసుల జోలికి వెళ్లాడు. ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై, అతనిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు అయ్యింది.
ఏం జరిగింది?
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో గత నెలలో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కృష్ణ మాస్టర్ తాము తెలిసిన వ్యక్తేనని, కానీ ఆయన మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి పోక్సో కేసు నమోదు చేశారు.
అరెస్ట్‌కు ప్రయత్నాలు
కేసు నమోదయ్యాక కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు ఎక్కడికక్కడ గాలించగా, అతను బెంగళూరులో తన అన్నింటి దగ్గర ఉన్నాడన్న సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేసి కంది జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Bhadrachalam: భద్రాచలం ఆలయ ఈవో బదిలీ.. కొత్త ఈవోగా దామోదర్‌రావు
వ్యక్తిగత జీవితంలో వివాదాలు
కృష్ణ ఇటీవలే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ ఆమెకు సంబంధించిన ₹9.50 లక్షలు తీసుకొని బెంగళూరుకు వెళ్లాడన్న ఆరోపణలు ఉన్నాయి. అతని పై ఇంతకు ముందు కూడా పలు యువతులపై మోసం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయాలు పెంచుకొని మోసం చేశాడంటూ బాధితులు చెబుతున్నారు.
పరిశ్రమలో కృష్ణ ప్రయాణం
కృష్ణ మాస్టర్ టీవీపై ప్రసారమైన “ఢీ” షో ద్వారా పాపులర్ అయ్యాడు. అలాగే “సూపర్ జోడీ” లో రన్నరప్, “డ్యాన్స్ ఐకాన్” షోలో విన్నర్ అయ్యాడు. తర్వాత “మట్కా” సినిమాతో కొరియోగ్రాఫర్ గా మారి, పలు సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేశాడు.