KTR

KTR: కేటీఆర్‌పై కేసు నమోదు

KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైనట్లు అధికారికంగా వెల్లడించారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రజిత, శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్, మాస్‌ కాపీయింగ్ వ్యవహారంలో నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారని రజిత తెలిపారు. ఈ ట్వీట్ కారణంగా తన పరువు, విశ్వసనీయత దెబ్బతిన్నాయని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రజిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: Rice Prices: సామాన్యులకు గుడ్​న్యూస్​.. సన్నబియ్యం కిలో రూ.43 మాత్రమే!

ఈ ఫిర్యాదు మేరకు నకిరేకల్‌ పోలీసులు కేటీఆర్‌తో పాటు క్రిషాంక్, కొణతం దిలీప్‌లపై నిరాధార ఆరోపణలు చేసినట్లు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు చిట్ల ఆకాష్ తన డ్రైవర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని రజిత ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు కింద పలు సెక్షన్లు ప్రయోగించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *