PM Narendra Modi:భారత ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ దేశ అత్యున్నత పురస్కారం దక్కింది. ఈ మేరకు ఆ దేశాధినేత, ముఖ్య అధికారులు ఆ పుస్కరాన్ని అందుకున్నారు. 43 ఏళ్ల అనంతరం ఆ దేశంలో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఆయన రెండు రోజుల పర్యటనలో ఎన్నో విశేషాలతోపాటు ఆ దేశ పురస్కారంతో ఆయనను సత్కరించడం విశేషం.
PM Narendra Modi:కువైట్ దేశ అత్యున్నత గౌరవ పురస్కారంగా భావించే ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్‌ను ప్రధాని మోదీకి ఆ దేశాధినేత షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జబర్-సబహ్ నుంచి అందుకున్నారు. విదేశాల అత్యున్నత నేతలకు, రాజ కుటుంబాల సభ్యులకు స్నేహానికి గుర్తుగా ఆ దేశం ఈ పురస్కారాన్ని అందిస్తూ వస్తున్నది. బేయన్ ప్యాలెస్‌లో ప్రధాని మోదీకి సైనిక వందనం కూడా లభించింది.