PM modi: 10 ఏండ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించారు..

PM modi: ప్రధాన మంత్రి మోదీ, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తెలియజేశారు. నాలుగోసారి దేశ ప్రజలు తనను ఆశీర్వదించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 21వ శతాబ్దంలో 25 శాతం కాలం గడిచిపోయిందని, దేశం వికసిత దేశంగా మారడం తమ లక్ష్యమని చెప్పారు.

గత 10 సంవత్సరాలలో 25 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించారని, పేదలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినట్లు పేర్కొన్నారు. ఐదేళ్లలో 12 కోట్ల మందికి తాగునీటి వసతి, 4 కోట్ల మందికి గృహ వసతి అందించినట్లు చెప్పారు.మోదీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేసి, కొంతమంది నేతలు పేదలతో ఫొటోలు తీసుకుంటారు, కానీ పార్లమెంట్‌లో పేదల సమస్యలపై చర్చలో పాల్గొనరు అన్నారు.

ప్రధాన మంత్రి, ప్రభుత్వాలు బూటకపు హామీలు ఇవ్వకపోయి, 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా పారదర్శకతను తీసుకువచ్చామని చెప్పారు.స్వచ్ఛ్ భారత్ లక్ష్యంతో ముందుకు వెళ్ళిపోతున్నామని, చెత్తను సంపదగా మార్చడం ద్వారా కొత్త ఆర్థిక మోడల్‌ను నిర్మిస్తున్నామని అన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *