Phone tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సుదీర్ఘంగా విచారించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు ఐదు గంటల పాటు కొనసాగింది.
ఈ విచారణలో సిట్ అధికారులు సంతోష్ రావు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ముఖ్యంగా ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్ఐబీ చీఫ్గా నియమించడంలో నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అనే అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను చూపిస్తూ ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీశ్ రావులను కూడా సిట్ విచారించిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ చేపట్టింది.
