Beetroot: అనారోగ్యాలు దరి చేరకూడదంటే తాజా పండ్లు, కూరగాయలు తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.. ఎందుకంటే వాటిలో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. ఇక బీట్‌రూట్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇంత మేలు చేసే బీట్‌రూట్‌కు ఈ వ్యాధులున్న వారు దూరంగా ఉంటే మంచిది. ఇందులోని కొన్ని మూలకాలు వారి శరీరానికి హాని కలిగిస్తాయి. వారు ఈ బీట్‌రూట్‌ను తీసుకుంటే ఎలాంటి నష్టం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కిడ్నీ స్టోన్ సమస్య: కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీట్‌రూట్ తీసుకోవడం తగ్గించాలి… ఎందుకంటే ఆక్సలేట్ మూత్రంలో స్ఫటికాలను ఏర్పరుస్తుంది. ఈ స్ఫటికాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తాయి.
బీపీ: అధిక లేదా తక్కువ బీపీ ఉన్నవారు, మందులు వాడేవారు బీట్‌రూట్‌ను తినకూడదు ఎందుకంటే ఇందులోని కొన్ని పదార్థాలు తలతిరగడం వంటి సమస్యలను కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి: Sleep Problem: నిద్ర పట్టడం లేదా ? ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్
జీర్ణ సమస్య: జీర్ణ శక్తి లేని వారికి బీట్‌రూట్ తీసుకోవడం మంచిది కాదు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం లేదా డయేరియా సమస్యలు వస్తాయి.
అలెర్జీ సమస్య: అలెర్జీ బాధితులు బీట్‌రూట్‌ను ఎప్పుడూ తినకూడదు, ఎందుకంటే ఇది దురద, దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.
బీట్ రూట్ కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఇది వారికి మంచిది కాదు. ఇతర అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. బీట్‌రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కడుపులో గ్యాస్, అజీర్తి సమస్యలకు దారితీస్తుంది.