Anemia

Anemia: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినండి

Anemia: భారతదేశంలో రక్తహీనత ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. చాలా మంది రక్తహీనత, హిమోగ్లోబిన్ లేకపోవడంతో బాధపడుతున్నారు. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత ముఖ్యంగా పిల్లలు, మహిళలు, బలహీనులను ప్రభావితం చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం 6 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల 67శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దాదాపు 52శాతం గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.

ప్రసవ సమయంలో సమస్యలను కలిగిస్తుందని, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శాకాహారులు తరచుగా సలాడ్ లేదా పండ్లను మాత్రమే తినడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు.

Also Read: Red Rice Vs White Rice: ఎర్ర బియ్యం లేదా తెల్ల బియ్యం..ఆరోగ్యానికి ఏది మంచిది..?

Anemia: రక్త కణాలలు తగ్గడానికి శరీరంలో ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీర్ణవ్యవస్థలో సమస్యలు, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం, ఏదైనా రకమైన గాయం, అధిక ఋతు రక్తస్రావం కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు.

మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మొలకలు నాన్-హీమ్ ఐరన్ మంచి మూలం. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *