ktr

ASK KTR: అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా

ASK KTR: తెలంగాణలో వున్నా ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగాలేవని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు  ‘ఎక్స్’ వేదికగా ‘ఆస్క్‌ కేటీఆర్‌’ (#ASKKTR) పేరుతో నెటిజన్లతో ఆయన ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత  సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారని. 2025 తర్వాత కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తారు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సమయం ఇచ్చారు అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh: రెడ్ బుక్ లో నెక్స్ట్ చాప్టర్ నీదే

ASK KTR: ప్రస్తుత రాజకీయాల్లో కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతున్నారో అర్థం చేసుకోవడం నాకు వ్యక్తిగతంగా చాలా కష్టంగా ఉంది. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదు.నా 18 ఏళ్ల ప్రజా జీవితంలో నా కుటుంబసభ్యులు మరియు పిల్లలు అవమానాలను ఎదుర్కొన్నప్పుడు, ఒక దశలో రాజకీయాల నుంచి నిష్క్రమించాలని చాలాసార్లు ఆలోచించాను కాని తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నాని స్పష్టం చేశారు. అని నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *