Peddi First Shot

Peddi First Shot: టాక్సిక్ రికార్డుని బ్రేక్ చేసిన పెద్ది!

Peddi First Shot: రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఫస్ట్ షాట్ శ్రీ రామ నవమి సందర్భంగా విడుదలై సంచలనం సృష్టించింది. ఈ ఫస్ట్ షాట్ కేవలం 24 గంటల్లో 36.5 మిలియన్ వ్యూస్‌తో ‘టాక్సిక్’ గ్లింప్స్ (36 మిలియన్ వ్యూస్) రికార్డును బద్దలు కొట్టింది. తెలుగులోనే ఈ అద్భుత విజయం సాధించిన ‘పెద్ది’, చరణ్‌ను భారతీయ సినిమాలో అగ్ర నటుడిగా మరింత బలపరిచింది. అన్ని ప్రాంతాల్లో ఈ ఫస్ట్ షాట్ భారీ ఆదరణ పొందగా, చరణ్ ఇంటెన్స్ మేక్ఓవర్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. హిందీ ట్రైలర్‌లో కూడా చరణ్ స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శివరాజ్‌కుమార్, దివేందు శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘పెద్ది’ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jaat: మళ్ళీ పుంజుకుంటున్న'జాట్'!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *