OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనౌన్స్‌మెంట్ నుంచే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మే 14 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ తన షెడ్యూల్‌ను జూన్ 10 నాటికి పూర్తి చేయనున్నారని సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్‌లో ఈ అప్‌డేట్ జోష్ నింపుతోంది. ఒక్కో అప్‌డేట్‌తోనూ హైప్ పెంచుతున్న ‘ఓజి’ బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరిన్ని వివరాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
