Pawan Kalyan

Pawan Kalyan: నేడు ఏలూరు జిల్లాలో పవన్‌కల్యాణ్‌ పర్యటన

Pawan Kalyan: ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సోమవారం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాథపురంలో పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం సుందరగిరి పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేయనున్నారు. ఆలయానికి చెందిన సుమారు 30 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను కూడా అధికారులకు అందజేయనున్నట్లు సమాచారం.

Also Read: Panchayat Elections: పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై హైకోర్ట కీల‌క వ్యాఖ్య‌లు

యాత్ర అనంతరం పవన్‌కల్యాణ్‌ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ముఖ్యంగా ఇటీవల నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్‌ పనులను సమీక్షించడంతో పాటు, కొత్తగా వేయనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే పలు ప్రాజెక్టులకు భూమిపూజ చేయడానికి సిద్ధమవుతున్నారని అధికారులు తెలిపారు.

డిప్యూటీ సీఎం పర్యటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఇతర అధికారులతో కలిసి పవన్‌కల్యాణ్‌ పర్యటన మార్గాన్ని పరిశీలించి భద్రత, ప్రజా ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. పవన్‌ సందర్శనతో ప్రాంతీయంగా ఉత్సాహం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *