Pawan Kalyan

Pawan Kalyan: పవన్‌ కీలక ప్రకటన.. వారికి ఆస్తి పన్ను ఉండదు..

Pawan Kalyan: దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే జవాన్లకు గౌరవం తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌ వేళ వీరమరణం పొందిన మురళీ నాయక్‌ కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం, ఐదు ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, అలాగే ఆయన తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడైతే, దేశ రక్షణలో నిబద్ధతతో పనిచేస్తున్న సైనికులందరికీ గుడ్‌న్యూస్‌ చెప్పే విధంగా మరో వినూత్న ప్రకటనను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చేశారు. సైనికుల సేవలను గుర్తించి, వారి కుటుంబాలను ఆదుకోవడానికి కీలకంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Ceasefire: కాల్పుల విరమణ తర్వాత.. పాకిస్తాన్ తన కార్యకలాపాలను ఆపివేస్తుందా?

పవన్ కల్యాణ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత రక్షణ దళాల్లో పనిచేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, పారామిలిటరీ, CRPF సిబ్బందికి గ్రామ పంచాయతీ పరిధిలోని వారి ఇళ్లపై ఆస్తి పన్ను మినహాయింపు వర్తించనుంది. ఇప్పటివరకు ఈ సౌకర్యం పదవీ విరమణ చేసిన సైనికులకు మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు ఈ ప్రయోజనం, విధుల్లో ఉన్న ప్రతి జవాను, ఆయన జీవిత భాగస్వామి కలిగి ఉన్న లేదా నివసిస్తున్న ఒక్క ఇంటికి వర్తించనుంది.

ఈ నిర్ణయం, సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్‌ సిఫార్సు ఆధారంగా తీసుకున్నదని వెల్లడించిన పవన్, “ఇది మన జవాన్లకు ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. వారి సేవలు అమూల్యమైనవి. మన ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా నిలబడేందుకు కట్టుబడి ఉంది,” అన్నారు.

ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సానుకూల స్పందనను కలిగిస్తోంది. జవాన్ల కుటుంబాలు ఆనందంతో స్పందించాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా పవన్ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

“జై హింద్!.. భారత్ మాతా కీ జై!” అంటూ ముగించిన పవన్ ట్వీట్, జాతి పట్ల గౌరవాన్ని మరింత పెంచేలా మారింది.

ALSO READ  Sugavasi Palakondrayudu: టీడీపీలో తీవ్ర విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *