Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కు తీవ్ర అనారోగ్యం

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో పాటు స్పాండిలైటిస్‌(spinalitis)తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగా ఆయనకు పూర్తిగా విశ్రాంతి అవసరమని వైద్యుల బృందం సూచించింది.

పవన్ కల్యాణ్‌కు జ్వరం మరియు దురదతో కూడిన నొప్పి సమస్యలు ఎదురవుతున్నాయి. వైద్యులు ఆయనకు శారీరక శ్రమ చేయకూడదని, పూర్తి విశ్రాంతిని తీసుకోవాలని హెచ్చరించారు. దీంతో, రేపు జరగనున్న కేబినెట్ సమావేశానికి ఆయన హాజరు కావడం అనిశ్చితంగా మారింది. పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై మరింత వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *