Hyderabad: ఎవడి ఇల్లు. ఎవడు తాకట్టు పెట్టాడు. పెళ్లి కోసం డాబులు కావాలి అని అతడి వడ్డుకు వెళ్తే..వాడు చేసిన మోసం మామూలు మోసం కాదు. దెబ్బకు ఆ ఇంటి అసలు ఓనర్స్ కె దిమ్మ తిరిగి …దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ ఆ కిలాడీ ఎం చేసాడు. పాపం అని కనికరం చూపకుండా …సైలెంట్ గా పేపర్లను మార్చేచ్సి …మొత్తం ఆస్తిని కొట్టేయాలి అనుకున్నాడు. కట్ చేస్తే బ్యాంకు మేనేజర్లు అక్కడికి వస్తే కాని తెలియ లేదు..వీడు ఎంత మోసగాడు అని
నిరుపేద కుటుంబానికి చెందిన నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని వారిని మాయమాటలతో నమ్మించాడు. తియ్యని మాటలతో వారి ఇంటిని ఓ దళారి, తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దళారి చేసిన మోసంతో ఓ కుటుంబం రోడ్డున పడ్డ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తమ తాతల కాలం నాటి ఇల్లు తమ పేరున లేదని, రుణం చెల్లించలేదని జప్తు కోసం బ్యాంకు అధికారులు రావడంతో మోసపోయామని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు.
బేగంపేట పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో ఉండే భూషణ్ అనే వ్యక్తి కుమార్తె వివాహం కోసం లోన్ ఇప్పించాలని దినకర్ అనే దళారిని సంప్రదించాడు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దినకర్ ప్రైవేటు ఫైనాన్సర్ వద్దకు తీసుకువెళ్లాడు. రుణం కావాలంటే ముందస్తుగా సంతకాలు చేయాల్సి ఉంటుందని చెప్పాడు. వారి ఇంటిని దినకర్ తన భార్య రజినికి విక్రయించినట్లుగా సంతకాలు చేయించుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో ఇంటి యజమాని భూషణ్ వాపోయారు.
ఇది కూడా చదవండి: BSNL New Recharge Plan: BSNL సూపర్ ప్లాన్.. ₹ 1499 తో ఏడాది అంతా మాట్లాడుతూనే ఉండండి.. డిటైల్స్ ఇవే!
అక్రమంగా ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం దినకర్, హైదర్ గూడ మహారాష్ట్ర బ్యాంక్‌లో భూషణ్ ఇంటి పేరిట రూ. కోటి రూపాయలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణానికి ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు నిన్న మధ్యాహ్నం సమయంలో ఇంటిని జప్తు చేసేందుకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము మోసపోయామని గ్రహించిన బాధిత కుటుంబంలోని భరత్, అనసూయ, భూషణ్‌లు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇదే విషయమై బాధిత కుటుంబానికి చెందిన న్యాయవాది కళ్యాణ్ దిలీప్ విజ్ఞప్తి మేరకు బ్యాంకు అధికారులు వారం రోజులు గడువు ఇచ్చారు. వీరికి రుణం ఇప్పిస్తానని మోసం చేసిన దినకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వీలైనంత త్వరగా దినకర్‌ను అరెస్ట్ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు పోలీసులను కోరారు.
