Pawan Kalyan

Pawan Kalyan: ట్రంప్ నిర్ణయంపై పవన్ కల్యాణ్ హర్షం: భారత ఆర్థిక వ్యవస్థకు బలం!

Pawan Kalyan:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరమైన కృషి వల్లే ఇది సాధ్యమైందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన కొనియాడారు.

సుంకాల తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ఇది భారతీయ రైతులకు ఒక గొప్ప వరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమెరికా వంటి పెద్ద దేశానికి ఎగుమతులు పెరగడం ద్వారా రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన ఈ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ప్రజలకు మేలు చేయడమే కాకుండా, భవిష్యత్తులో మన దేశ ఎగుమతి రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *