Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. లక్ష వ్యవసాయ కుంటలు (ఫామ్ పాండ్స్) నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించారు. కరవు కాలాల్లో ఇవి రైతులకు మద్దతుగా నిలుస్తాయని, భూగర్భ జలాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా ఇప్పటికే సుమారు 1 టీఎంసీ నీటిని నిల్వ చేయగలిగామని, ఉపాధి హామీ కూలీలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. రైతుల సహకారమే ఈ విజయానికి మూలమని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది, క్షేత్రస్థాయి కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని, ఇందుకుగాను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.