Pawan : రాష్ట్ర అటవీ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటవీ భూములను ఆక్రమించిన వారి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.
“ఎవరు ఎంత భూమిని ఆక్రమించారు? వారిపై నమోదైన కేసులు ఏమిటి? – ఈ సమాచారమంతా పారదర్శకంగా ప్రజలకు తెలిసేలా అధికారిక వెబ్సైట్లో ప్రకటించాలి” అని పవన్ కళ్యాణ్ సూచించారు.
మంగళంపేట అటవీభూముల ఆక్రమణపై వచ్చిన విజిలెన్స్ రిపోర్టులను ప్రాతిపదికగా తీసుకొని చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అటవీ ఆస్తులను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాజకీయాలకు అతీతంగా భావితరాల కోసం ప్రకృతి సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అటవీ శాఖ అధికారులు చురుకుగా వ్యవహరించాలని, ఆక్రమణలు కొనసాగకుండా నిరంతర పర్యవేక్షణ అవసరమని ఆయన సూచించారు.

