వంపు గూడ లో మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు పత్తి కుమార్ 46వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు ,కాంగ్రెస్ నాయకులు, సహచర నాయకులు, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని పత్తి కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పత్తి కుమార్ ధన్యవాదములు తెలిపారు. 22 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని ఆయన చెప్పారు. పార్టీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీ పట్ల అంకిత భావంతో తాను నిలబడ్డానని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత మున్సిపల్ ఎన్నికల సమయంలో కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. దురదృష్టవశాత్తూ అప్పటి పరిస్థితుల్లో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. అయినా ప్రజల నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి.. పదవులతో పని లేకుండా.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి అండగా ఉంటున్నట్టు వివరించారు. ఈ క్రమంలో తనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వెన్నుదన్నుగా ఉంటున్నారనీ, భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత ప్రజల మేలు కోసం అందరం కలిసి పనిచేస్తామని పత్తి కుమార్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సింగం కిరణ్ , సతీష్ యాదవ్ , శ్రీనివాస్ గౌడ్ ఇతర కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు.