Parliament Budget Session

Parliament Budget Session: ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు.. పూర్తయిన సన్నాహాలు

Parliament Budget Session: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రేపు జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించారు.

రెండు భాగాల బడ్జెట్ సెషన్‌లో మొదటి రోజు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ, బడ్జెట్‌పై చర్చకు నిర్మలా సీతారామన్‌ సమాధానమిస్తారు.

ఇది కూడా చదవండి: Komatireddy Venkata Reddy: కేటీఆర్‌, హ‌రీశ్‌రావుపై కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అదేవిధంగా ఫిబ్రవరి 6న రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. మొదటి దశ సమావేశాలు ఫిబ్రవరి 13తో ముగుస్తాయి. స్వల్ప విరామం తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

అనంతరం వివిధ మంత్రిత్వ శాఖల నుంచి గ్రాంట్ల అభ్యర్థన, బడ్జెట్ ప్రక్రియపై చర్చలు జరుగుతాయి. ఈ సమావేశాల శ్రేణిలో మొత్తం 27 సెషన్లు జరుగుతాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  UP:అక్క‌డమ్మాయి.. ఇక్క‌డబ్బాయి.. పాక్ అమ్మాయితో భార‌త్ అబ్బాయికి ఆన్‌లైన్ పెళ్లి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *