Parliament: కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఇప్పటికే 4 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 10 కోట్ల మందికి కొత్తగా గ్యాస్ కనెక్షన్లు అందించామని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా, ఆక్వా రంగంలో రెండో స్థానంలో నిలిచిందని ఆమె పేర్కొన్నారు.
Also Read: AP News: ఏపీలో రూ.లక్ష కోట్లు దాటిన పన్నుల రాబడి..
ప్రజల రవాణా సౌకర్యాల కోసం 150కి పైగా వందే భారత్ రైళ్లను నడుపుతున్నామని, ఈశాన్య రాష్ట్రాలకు రైలు కనెక్టివిటీని మరింత పెంచామని రాష్ట్రపతి వెల్లడించారు. ఆదాయ పన్ను పరిమితిని రూ. 12 లక్షల వరకు పెంచడం వల్ల మధ్యతరగతి వారికి పెద్ద ఊరట లభించిందని ఆమె గుర్తుచేశారు. భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని గ్రీన్ ఎనర్జీ దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆమె వివరించారు.
