Municipal Elections

Muncipal Elections: మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మీరు పోటీ చేస్తున్నారా? ఇవే నిబంధ‌న‌లు!

Muncipal Elections:మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మీరు పోటీ చేస్తున్నారా? నిబంధ‌న‌లు, ఖ‌ర్చులు, వెసులుబాటు, కావాల్సిన ప‌త్రాలు, వెసులుబాటు త‌దిత‌ర విష‌యాలు మీరు తెలుసుకోవాల్సిందే. ఈ మేర‌కు నిన్న ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అభ్య‌ర్థుల‌కు ఉండాల్సిన అర్హ‌త‌లు, ఇత‌ర నిబంధ‌న‌ల‌ను కూలంక‌శంగా వివ‌రించింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ఈ రోజు (జ‌న‌వ‌రి 28) నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆ అర్హ‌తలు ఏమిటో తెలుసుకుందాం రండి.

Muncipal Elections:కార్పొరేట‌ర్‌, కౌన్సిల‌ర్‌, మేయ‌ర్‌, చైర్‌ప‌ర్స‌న్లుగా పోటీకి ఒకే త‌ర‌హా అర్హ‌త‌లు ఉంటే స‌రిపోతుంది. క‌నీస వ‌య‌సు 21 సంవ‌త్స‌రాలు ఉండాలి. సంబంధిత వార్డులో లేదా డివిజ‌న్ ప‌రిధిలోని ఓట‌రై ఉండాలి. ఏ కోర్టు నుంచి కూడా నేరాల కార‌ణంగా అన‌ర్హ‌త వేటు ప‌డి ఉండ‌రాదు. ఏదైనా పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన‌ట్ట‌యితే ఆ పార్టీ బీ ఫామ్‌ను స‌మ‌ర్పించాలి. దానితోపాటు అఫిడ‌విట్ స‌మ‌ర్పించాలి.

Muncipal Elections:అభ్య‌ర్థికి ఆ మున్సిప‌ల్‌, లేదా కార్పొరేష‌న్ ప‌రిధిలో ఒక్క‌డైనా ఓటు హ‌క్కు ఉంటే స‌రిపోతుంది. ఏ వార్డు లేదా డివిజ‌న్ నుంచి అయినా పోటీ చేసే అవ‌కాశం ఉంటుంది. పోటీ చేసే స‌మ‌యంలో ఆ అభ్య‌ర్థిని ఒక్క‌రు బల‌ప‌రిచినా స‌రిపోతుంది. కానీ, ఆ అభ్య‌ర్థి పోటీ చేసే వార్డు లేదా డివిజ‌న్ ప‌రిధిలో ఉన్న ఓట‌రే బ‌ల‌ప‌ర‌చాలి. అదే బ‌ల‌ప‌రిచిన వ్య‌క్తి ఒకరిని బ‌ల‌ప‌రిచి సంత‌కం చేశాక‌.. మ‌రో అభ్య‌ర్థిని బ‌ల‌ప‌ర‌చ‌రాదు. ఒక‌వేళ అదే జ‌రిగితే ఆ అభ్య‌ర్థి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంది.

Muncipal Elections:నామినేష‌న్‌కు ఎన్నిక‌ల అధికారి నుంచి పొందిన ద‌ర‌ఖాస్తు ఫామ్‌నే ఇవ్వాలి. అఫిడ‌విట్‌లో ఆస్తులు, కేసుల వివ‌రాల‌ను క‌చ్చితంగా పొందుప‌ర్చాలి. ద‌ర‌ఖాస్తు ఫామ్‌కు అభ్య‌ర్థి ఓట‌రు ఐడీ లేదా ఆధార్ కార్డును జ‌త‌చేయాలి. అవ‌స‌రం మేర‌కు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు జ‌త‌చేయాలి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ పేర్కొన్న మాదిరిగా డివిజ‌ట్‌ను చెల్లించాలి. పోలైన ఓట్ల‌లో 15.3 శాతం కంటే త‌క్కువ ఓట్లు వ‌స్తే డిపాజిట్ జ‌ప్తు అవుతుంది.

Muncipal Elections:ఎన్నిక‌ల ప్ర‌చార ఖ‌ర్చుపై గట్టి నిఘా ఉంటుంది. ప్ర‌తి రూపాయి లెక్క చూపాలి. మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్య‌ర్థి రూ.ల‌క్ష వ‌ర‌కు ఖ‌ర్చు చేసే అవ‌కాశం ఉన్న‌ది. అదే కార్పొరేష‌న్ ప‌రిధిలోని అభ్య‌ర్థికి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసే అవ‌కాశం ఉన్న‌ది. ప్ర‌తి అభ్య‌ర్థి ఖ‌ర్చుల రిజిస్ట‌ర్‌ను నిర్వ‌హించాలి. ఎన్నిక‌ల అధికారికి మ‌ధ్య‌లో ఒక‌సారి, ఎన్నిక‌లు పూర్త‌యిన 30 రోజుల్లోపు ఖ‌ర్చుల రిజిస్ట‌ర్‌ను చూపాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *