pakistan: చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ

pakistan: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు చనిపోయిన ఘటనకు ప్రతీకారంగా, భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పెద్దస్థాయిలో దాడి చేసింది. బుధవారం తెల్లవారుజామున 1 గంట నుంచి సుమారు అరగంట పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. భారత్ దళాలు పాకిస్థాన్ మరియు పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్)లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను గగనతల దాడులతో నాశనం చేశాయి.

సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు సమాచారం. ప్రధానంగా దాడి జరిగిన ప్రాంతాలు: సవాయి నల్ల, ముర్దికే, భీంబర్, బహవల్పూర్ తదితర ప్రాంతాలు. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఈ దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మంది మరియు నలుగురు సహాయకులు చనిపోయారని చెప్పాడు.

ఈ ఘటన అనంతరం ముర్దికేలో ఉగ్రవాదుల అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో లష్కరే తోయిబా నేతలు, పాకిస్థాన్ ఆర్మీ, పోలీసు, పౌర అధికారులు పాల్గొన్నారు. పాకిస్థాన్ జెండాలతో ఉన్న శవపేటికలు తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *