Pahalgam Attack:జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఓ ముష్కరుని ఇంటిని భారత సైన్యం పేల్చేసింది. నిన్న రాత్రి బాంబులతో బ్లాస్ట్ చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్‌కు చెందిన ఉగ్రవాది ఆసిఫ్‌ఖాన్ పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్టు భద్రతా దళాలు కీలక సమాచారాన్ని సేకరించాయి. ఆ తర్వాతే త్రాల్‌లో ఉన్న అతని ఇంటిని పేల్చివేసినట్టు సమాచారం. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినా తీవ్ర చర్యలు తప్పవని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.
Pahalgam Attack:పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ రగిలిపోతున్నది. అంతర్గతంగా, సరిహద్దు ప్రాంతాల్లో ముష్కరుల కోసం గాలింపు చర్యలు తీవ్రంగా చేపడుతున్నది. మరోవైపు భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ దేశంపై కఠిన చర్యలను అమలు చేస్తున్నది. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేసింది. ప్రాజెక్టు ఐదు గేట్లను మూసి ఉంచి జలాలు కిందికి (పాకిస్తాన్‌వైపు) వెళ్లకుండా నిలిపి వేసింది. ఈ మేరకు సింధు జలాల నిలిపివేత అంశాన్ని భారత్ ప్రభుత్వం లేఖ ద్వారా పాక్ అధికారి సయీద్ అలీ ముర్తుజాకు వివరించింది.