IPL 2025 – Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా చేపట్టిన ఈ దాడితో రెండు దేశాల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విపక్ష నేతలతో పాటు ప్రతీఒక్కరు ఈ దాడిని స్వాగతించారు. ప్రధాని మోడీ సహా కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే దేశంలో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఐపీఎల్‌ను ఆపేస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు
ఇప్పటికే ఐపీఎల్లో ఇప్పటికే 56 మ్యాచులు అయిపోయాయి. లీగ్ స్టేజ్‌లో ఇంకా 14 మ్యాచులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్లే ఆఫ్స్ రేసుపై ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే 3జట్లు ఇంటిబాట పట్టాయి. ఇక ఫైనల్ కలిపి మరో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేయడం కష్టమే అని చెప్పొచ్చు. తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు రాలేదని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. పరిస్థితులు కఠినంగా మారితే అప్పుడు నిర్ణయం తీసుకుంటాం.. ఇప్పటికైతే షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను బట్టే తమ నిర్ణయం ఉంటుందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టంచేశారు. అందుకు తగినట్లుగా సిద్ధంగా ఉంటామని తెలిపారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దేశం కోసం తామంతా సపోర్ట్‌గా ఉంటామని తెలిపారు. ఒకవేళ ఐపీఎల్ వాయిదా వేస్తే టోర్నీ నిర్వహించలేని స్థితిలో భారత్ ఉంది అనే విమర్శలు వస్తాయి కాబట్టి వాయిదా వేసే అవకాశాలు అయితే చాలా తక్కువనే చెప్పాలి.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై మంత్రులతో మోడీ కీలక వ్యాఖ్యలు..!
IPL 2025 – Operation Sindoor: మరోవైపు టోర్ని జరిగే దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వస్తే విదేశీ క్రికెట్ బోర్డులు వెంటనే తమ దేశ క్రికెటర్లను వెనక్కి పిలిపిస్తాయి. కానీ భారత్‌లో భద్రతాపరంగా ఇబ్బంది ఉండదు కాబట్టి పరిస్థితి అలా ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు. ఇప్పటివరకు విదేశీ క్రికెటర్లు ఎవరూ తమ భద్రతపై ఆందోళన పడలేదని తెలిపారు.