Jammu Kashmir: జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అబ్దుల్లాతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. షేర్ ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11:30 గంటలకు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల చేత ప్రమాణం చేయించారు.
Jammu Kashmir: ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత కనిమొళి, ఆప్ నేత సంజయ్‌సింగ్, మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముప్తీ తదితరులు హాజరయ్యారు.