Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దు

జమ్ము కశ్మీర్‌లో తమ విజయం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్‌లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దని సూచించారు. జమ్ము కశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని, అయితే ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత ఉండాలన్నారు. ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వారు ఎలాంటి ట్రిక్స్‌ను ప్లే చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దని సూచించారు.

మరోవైపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ దూసుకెళ్తోంది. ఇక్కడ కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 52 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 28, పీడీపీ 2 సీట్లలో ముందంజలో ఉన్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *