O Torture Prema: మాదాల రంగారావు గారి మనవడు, మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల మూడో తరం హీరోగా తెరకెక్కుతున్నాడు. శ్రీకరం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీకర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఓ టార్చర్ ప్రేమ”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ గారు విడుదల చేశారు. సన్నీ మాదాలతో పాటు మౌనిక డాకోజు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ ప్రేమ కథ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Also Read: Mohan Babu: మంచు ఫ్యామిలీకి మరో షాక్.. ఏపీలో మోహన్‌బాబు, విష్ణుపై కేసు
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకర్ కృష్ణ రచన, దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా వహించడం విశేషం. సినిమాటోగ్రఫీ సామి, ఎడిటింగ్ ప్రతీక్ నూటి అందించారు. సంగీతం ఇషాక్ వలి అందించారు. పరచూరి గోపాలకృష్ణ గారు ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే సన్నీ మాదాల ప్రేమ మార్గాన్ని ఎంచుకున్నాడని, అతను ఈ అద్భుతమైన ప్రేమ కథతో మూడో తరం హీరోగా వస్తున్నాడని, దర్శకుడు శ్రీకర్ కృష్ణ దాసరి నారాయణ రావు గారి రీతిలో రచన, దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా అందించారని, ఈ చిత్రం విజయవంతం కావాలని అన్నారు. దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ ఇది మంచి ప్రేమ కథాంశంతో కూడిన చిత్రమని, నవ్వులు, భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.
