WTC Final: దక్షిణాఫ్రికా 27 ఏళ్ళ నిరీక్షణ ఫలించింది. ఎదురు చూపులకు తెరదించుతూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది. “చోకర్స్” కాదు ఛాంపియన్స్ అని చాటింది. లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలిచింది. టెంబా బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐసీసీ టైటిల్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్‌క్రమ్ సెంచరీతో సునాయాసంగా ఛేదించింది. టెంబా బవూమా కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
క్రికెట్ లో దక్షిణాఫ్రికా ప్రపంచ మేటి జట్లలో ఒకటి. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా చివరి వరకూ పోరాడుతూ వస్తోంది. సింపుల్ గా దక్షిణాఫ్రికా ను ప్రోటీస్ అంటారు. అయితే పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ ఉన్నప్పటికీ కీలకమైన మ్యాచ్ ల్లో తడబాటు అనేది దక్షిణాఫ్రికా కు పరిపాటి గా మారింది. అందుకే దక్షిణాఫ్రికా కు “చోకర్స్” అనే ముద్ర పడింది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ లో భారత్ తో దక్షిణాఫ్రికా తలపడింది.
Also Read: Vitamin D Deficiency: విటమిన్ డి లోపంతో.. ఈ సమస్యలు
భారత్ తో జరిగిన మ్యాచ్ లో చివర్లో 24 బాల్స్ కు 26 పరుగులు చేయాలి. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా తడబాటు తో కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. 1999 ప్రపంచ కప్ లో చివర్లో 4 బంతులకు ఒక పరుగు చేస్తే దక్షిణాఫ్రికా గెలిచి ఉండేది. తడబాటు కారణంగా ఆ మ్యాచ్ ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా తో జరిగిన ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 214 పరుగులు చేసింది. 214 పరుగుల లక్ష్య సాధనలో దక్షిణాఫ్రికా ఫైనల్ ఓవర్ లో 9 పరుగులు చేయాలి. బ్యాట్స్ మన్ ఫ్లెమింగ్ తొలి 2 బంతులకు రెండు ఫోర్లు కొట్టడంతో స్కోర్ సమానమైంది. ఇక 4 బంతులకు 1 రన్ తీస్తే విజయం. ఇలాంటి సందర్భంలో నాన్ స్ట్రైకర్ గా ఉన్న డొనాల్డ్ రన్ అవుట్ తో చేతిలోకి వచ్చిన విజయం చేజారింది. అందుకే చోకర్స్ అనే ముద్ర. ఈ సారి విజయంతో ఆ ముద్ర నుంచి బయట పడిన దక్షిణాఫ్రికా.
టెంబా బవుమా దక్షిణాఫ్రికా జట్టుకు అద్భుతమైన కెప్టెన్‌గా నిలిచారు. నల్ల జాతీయుడు. కోటా టాగ్ అనే ముద్ర ఆయన పై ఉంది. చేయి నొప్పి ఉన్నప్పటికీ వైనల్ లో బాద్యతాయుతంగా ఆడి 66 పరుగులు సాధించారు. బవుమా 10 టెస్ట్ మ్యాచ్ లకు సారధ్యం వహించగా అందులో 9 విజ్యమ సాధించారు. ఆస్ట్రేలియాపై గెలుపుతో ఆయన ఒక ప్రత్యేకమైన కెప్టెన్సీ రికార్డును నెలకొల్పారు. 1920-21లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్న వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ రికార్డును బవుమా అధిగమించారు. టెస్ట్ మ్యాచ్‌లో ఒకటిని కూడా కోల్పోకుండా తొమ్మిది విజయాలు సాధించిన ప్రపంచంలో ఏకైక కెప్టెన్ బవుమానే. విజయోత్సవాన్ని బవుమా కుమారుడితో జరపడం వైరల్ అయింది.