Nitya Menon

Nitya Menon Trolling: మరో వివాదంలో నిత్యామీనన్.. ఈసారి ఏకంగా దేవుడిపైనే వింత డైలాగులు!

Nitya Menon Trolling: ఒక్కోసారి మన సెలబ్రిటీలు తమకు తామే చాలా ఎక్కువగా ఊహించేసుకుంటారు. తమను మించిన వారు లేరన్నట్టు ప్రవర్తిస్తారు. మాట్లాడతారు. ఎదో ఒకటి నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఆనక తీరిగ్గా అబ్బే నా మాటలు వక్రీకరించారంటూ పిల్లిమొగ్గలు వేస్తారు. ఇదిగో ఇప్పుడు హీరోయిన్ నిత్యామీనన్ తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా దేవుని పైన చేసిన వ్యాఖ్యలతో వివాదాన్ని రేపారు. 

Nitya Menon Trolling: ఇటీవల ఆమెకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తనకు నేషనల్ అవార్డు రావడంపై వింత వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా ఫీల్డ్ వదిలేద్దామని అనుకున్నాననీ కానీ, నేషనల్ అవార్డు రావడంతో సినిమాలకు దూరంగా వెళ్లకుండా ఆగిపోయానని చెప్పారు నిత్యామీనన్. అక్కడితో ఆగిపోతే బాగానే ఉండును.. మానమూ ఆమె గురించి పెద్దగా మాట్లాడుకునే అవసరమూ రాకపోను. కానీ, ఆమె దీనికి కొనసాగింపుగా దేవుడు నాకు నేషనల్ అవార్డు లంచంగా ఇచ్చి సినిమాలు వదలకుండా ఆపాడు అనే అర్ధం వచ్చేలా మాట్లాడింది. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. నెటిజన్లు నిత్యామీనన్ ను ట్రోలింగ్ చేస్తున్నారు. 

Nitya Menon Trolling: తన నటనకు వచ్చిన అవార్డు పట్ల ఆమె మాట్లాడే క్రమంలో దేవుడు లంచం ఇచ్చాడు అనడం ద్వారా నిత్యా నటనను తక్కువ చేసిందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల నిత్యామీనన్ తరచూ వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. 

తనకు నటన అంటేనే ఇష్టం లేదని.. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రపీ ఇంట్రస్ట్ అని.. తనను ఇంట్లోవాళ్ళు ఫోర్స్ చేస్తే సినిమాల్లోకి వచ్చానంటూ ఒకసారి మాట్లాడారు నిత్యామీనన్. తరువాత చెన్నైలో ఒక ఈవెంట్ లో ఎటెండ్ అయినపుడు తన ప్రవర్తన కూడా అందరినీ ఇబ్బంది పెట్టింది. 

Nitya Menon Trolling: ఆ ఈవెంట్ లో నిత్యాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒక జర్నలిస్ట్ ప్రయత్నించారు. ఆమె దానికి నిరాకరిస్తూ.. తనకు జలుబు చేసిందని చెప్పి వెళ్ళిపోయింది. ఇది జరిగిన పది నిముషాల్లోనే అదే ఈవెంట్ లో ఆ సినిమా హీరో జయం రవికి, దర్శకుడు మిష్కిన్ ను కిస్.. ముద్దులు హగ్గులు ఇచ్చింది. దీంతో అభిమాని కరచాలనం అడిగితే ఇవ్వలేదు కానీ మూవీ టీమ్ కు మాత్రం హగ్గులు, ముద్దులు ఇచ్చిందని సోషల్ మీడియాలో ఏకీపారేశారు. అయినప్పటికీ నిత్యామీనన్ మళ్ళీ వివాదాస్పదంగా మాట్లాడడం అభిమానులకు కూడా అసహనాన్ని తెప్పిస్తోంది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Trump T1 Mobile: ఐఫోన్ 17 తో ట్రంప్ మొబైల్ పోటీ.. ఇంత తక్కువ దారకేనా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *