Nigeria: ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికీ మానవత్వం అనేదే లేకుండాపోతున్నది. రానురాను రాక్షసత్వం మితిమీరుతున్నది. తాజాగా నైజీరియా దేశంలో ఇలాంటి దారుణమే చోటుచేసుకున్నది. సెంట్రల్ బెన్యూ రాష్ట్రంలోని యెలెవాటా గ్రామంలో దుండగులు పెద్ద ఎత్తున దాడులకు దిగారు. 100 మందికిపై ప్రజలను గదుల్లో బంధించి సజీవ దహనం చేశారు. మరికొందరిని తీవ్రంగా గాయపర్చారు. రైతులు, పశువుల కాపరుల మధ్య జరిగిన భూవివాదమే ఈ సజీవదహనానికి కారణంగా భావిస్తున్నారు.
Nigeria: నైజీరియాలోని మధ్యప్రాచ్యంలో రెండు వేర్వేరు మతస్థులు అధికంగా ఉంటారు. ఇక్కడ కొంతకాలంగా పశువుల కాపరులకు, రైతులకు మధ్య భూవివాదం కొనసాగుతున్నది. బెన్యూలోని భూమిని పశువుల మేతకు వదలాలని పశువుల కాపరులు డిమాండ్ చేస్తుండగా, రైతులు మాత్రం తాము వ్యవసాయం చేసుకుంటామంటూ మొండికేస్తున్నారు. ఇది చిలికి చిలికి మతం రంగు పులుముకున్నది. 100 మందిని సజీవ దహనం చేసుకునేదాకా దారితీసింది.
Nigeria: గతంలో నుంచి ఈవివాదం కొనసాగుతున్నట్టు ఎస్‌బీఎం ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. 2019 నుంచి ఈ హింసాత్మక ఘర్షణల్లో సుమారు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ ఘర్షణలు ఇప్పట్లో సమసిపోయేలా ఉన్నట్టు కనిపించడం లేదు.

