Pahalgam Attack

Pahalgam Attack: పహల్గాం కాల్పుల దర్యాప్తు బాధ్యత ఎన్‌ఐఏకి

Pahalgam Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఇటీవల జరిగిన భయానక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు నేపాల్‌కు చెందినవారు కాగా, మిగిలినవారిలో 25 మంది హిందూ పురుషులుగా గుర్తించారు.

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది. ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్ పోలీసులు చూసిన ఈ కేసును ఇప్పుడు అధికారికంగా ఎన్ఐఏకు అప్పగించారు. ఏప్రిల్ 23 నుంచే ఎన్ఐఏ బృందాలు ఘటన స్థలాన్ని పరిశీలిస్తూ, దర్యాప్తును వేగవంతం చేశాయి.

ఏప్రిల్ 22న బైసరన్ లోయలో దుండగులు పర్యాటకులపై విచక్షణ లేని కాల్పులు జరిపారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు మతాధారంగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. వారు హిందువులనే గుర్తించి కాల్పులు జరిపారని వివరాలు చెబుతున్నాయి.

Pahalgam Attack:దాడి జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్ ప్రత్యేక బృందాలు తక్షణమే స్పందించాయి. 25 మంది కమాండోలు ప్రమాద స్థలానికి 40 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసి చేరుకొని భద్రతా చర్యలు చేపట్టారు. పహల్గాం చుట్టూ చెక్‌పోస్టులు, భద్రతా గుమాస్తాలను ఏర్పాటు చేశారు. పోలీస్ బలగాలు అక్కడికి చేరుకొని పర్యాటకులను రక్షిత ప్రాంతాలకు తరలించాయి.

ఎన్ఐఏ బృందాలు ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. సాక్షుల ఫోటోలు, వీడియోలు, ఫోరెన్సిక్ ఆధారాలు జాగ్రత్తగా సేకరిస్తున్నారు. ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.

Also Read: Kadiri YCP office closed: కదిరిలో ‘జీరో’కు పడిపోయిన వైసీపీ గ్రాఫ్‌!

Pahalgam Attack: ఉగ్రవాదులు ఘటనా స్థలానికి ఎలా వచ్చారు, దాడి తర్వాత ఎలా తప్పించుకున్నారనే విషయాల్లో ఎన్ఐఏ నిశితంగా పరిశీలిస్తోంది. భద్రతా బలగాలు కశ్మీర్ లోయలో అనుమానితుల కోసం గాలింపు చేపట్టాయి. ఇప్పటివరకు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతేగాక, గతంలో గుర్తించిన పది మంది ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు.

ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. పర్యాటక ప్రాంతంలో జరిగిన ఈ విధమైన ఘోర ఘటనకు కారణమైన ఉగ్ర కుట్ర వెనుక ఉన్న వారి గుట్టును చీల్చేందుకు ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి, మరిన్ని దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ దాడి ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం లేకుండా భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు అపోహలకు లోనుకాకుండా, అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *