Delhi Blast: న్యూఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లోని పీవీఆర్ సినిమా సమీపంలో నిన్న ఉదయం బాంబు పేలింది. అనే కోణంలో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని రోహిణి జిల్లా ప్రశాంత్ విహార్‌లోని పీవీఆర్ థియేటర్ సమీపంలోని పార్క్‌లో గురువారం ఉదయం 11:50 గంటలకు పేలుడు సంభవించి, ఆ ప్రాంతం పొగమయంగా మారింది.
ఆ సమయంలో అక్కడ త్రీవీలర్ పార్కింగ్ చేస్తున్న చేతన్ కుష్వాహ (28)కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో రికార్డ్ సృష్టిస్తున్న చలి
Delhi Blast: సమాచారం అందుకున్న 50 మందికి పైగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. బాంబు డిటెక్షన్ టీమ్, స్నిఫర్ డాగ్, ఫైర్ ఇంజన్లను రప్పించి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్‌ఐఏ అధికారులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.పేలుడు శబ్దం వినిపించిన ప్రదేశంలో తెల్లటి రసాయన పొడి, ముద్దలు చెల్లాచెదురుగా పడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని విచారణకు తరలించారు. ఇది ఉగ్రవాదుల పనేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే ప్రశాంత్ విహార్ ప్రాంతంలో అక్టోబర్ 20న సీఆర్పీఎఫ్ స్కూల్ సమీపంలో బాంబు పేలింది. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఆ మళ్ళీ అక్కడ గుర్తుతెలియని వస్తువు పేలడం ఆందోళన రేకెత్తిస్తోంది.

