Nepal:జెన్-జెడ్ ఆందోళనతో అల్లకల్లోలమైన నేపాల్ దేశంలో ఆ దేశ సైన్యం కర్ఫూ విధించింది. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలను జారీ చేసింది. రోడ్లపై ఎక్కడా గుమిగూడ వద్దని, ఎవరూ సంచరివద్దని హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాపై అక్కడి ప్రభుత్వం విధించి నిషేధం ఈ హింసకు దారితీసింది. హింసాత్మక సంఘటనలతో ఆ దేశప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి పరారయ్యారు.
Nepal:నేపాల్‌లో జరిగిన ఆందోళనలో సుమారు 20 మందికి పైగా పౌరులు ప్రాణాలు విడిచారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. జనసంచారం పనికిరాదని, నిరసన ప్రదర్శనలు, సమావేశాలు నిషేధమని నేపాల్ సైన్యం ప్రకటించింది. పరిమిత కర్ఫూను దేశవ్యాప్తంగా విస్తరించింది. రాజ్యాంగాన్ని తిరగరాయాలని యువ నిరసనకారులు ఆ దేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Nepal:ఈ మేరకు నిరసనకారులతో ఈ రోజు (సెప్టెంబర్ 10న) నేపాల్ దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సమావేశం కానున్నారు. వారి ఆందోళనలకు గల కారణాలను, డిమాండ్లను తెలుసుకోనున్నారు. అనంతరం శాంతియుత వాతావరణం నెలకొనేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా, నేపాల్‌లో అస్తవ్యస్థ పరిస్థితుల దృష్ట్యా భారత్ సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసింది.