C. P. Radhakrishnan: ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ ఎంపీ, సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు. నామినేషన్ పత్రాలపై మోదీతో పాటు ఇతర ప్రధాన నేతలు సంతకాలు చేశారు.
ఇది కూడా చదవండి: Nellore Aruna Nidigunta Arrested: రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్టు
సీపీ రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినవారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన బీజేపీకి దక్షిణ భారతంలో కీలక నేతగా పేరు తెచ్చుకున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం పార్లమెంటులో ఎన్డీఏకు మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయావకాశాలు బలంగా ఉన్నట్లు భావిస్తున్నారు.