Anaganaga Oka Raju: మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది.అనగనగా ఒక రాజు సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ప్రోమో అదిరిపోయిందనే చెప్పాలి. కాగా ఇటీవల ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా చేసేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని పాలకోల్లులో జరుగుతుంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి తో పాటు మిగతా నటి నటులపై సీన్స్ తీస్తున్నారు. అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 రోజుల పాటు షూటింగ్ చేయనుంది యూనిట్. ఆ తర్వాత హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
