Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జోడీగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ప్రమోషన్స్ లేకపోవడం, షూటింగ్ పూర్తి కాలేదని టాక్ వినిపిస్తోంది. దాంతో ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Akhanda 2: అఖండ 2 టికెట్ రేట్లపై కీలక ప్రకటన?
నిర్మాత నాగ వంశీ, డైరెక్టర్ మారి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ చేయాలని ప్రకటించారు. అయితే దీపావళి తర్వాత ఈ సినిమా ఎక్కడా కనిపించడం లేదు. ఒక్క లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. మిక్కీ జే మేయర్ సంగీతం సిద్ధంగా ఉన్నా హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇంకా 30 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో సంక్రాంతి రిలీజ్ కష్టమని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ‘రాజా సాబ్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి పెద్ద సినిమాలు సంక్రాంతి రేసులో ఉండటంతో, ఈ చిత్రం రిపబ్లిక్ డే లేదా ఫిబ్రవరికి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నిర్మాత నాగ వంశీ మీడియా ముందు రాకపోవడం కూడా అనుమానాలు పెంచుతోంది.
