Navaratri Celebrations: ఈ నెల సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీ శరన్నరవ రాత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైన కనకదుర్మ అమ్మవారు గతంలో 10 అలంకారాలలో దర్శనమిచ్చేవారు. ఈ సారి 11 అవతారాలతో భక్తులకు లోకమాతగా ప్రత్యేక దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే నవరాత్రుల శోభ సంతరించుకున్నది. ఊరూరా అమ్మవారి విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ఈ 11 రోజుల్లో అమ్మవారిని విశేష వస్త్రాలతో అలంకరించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి వేడుకోనున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉండనున్నాయి.
11 రోజులు – అమ్మవారి అలంకారాలు – విశేష వస్త్రం – నైవేద్యాలు
1) మొదటిరోజు – బాలా త్రిపుర సుందరీదేవి – ఆరేంజ్ రంగు చీర – తీపి బూంది, శనగలు లేదా పెసరపప్పు పాయసం
2) రెండో రోజు – గాయత్రీ దేవి – నీలం రంగు చీర – రవ్వ కేసరి, పులిహోర
3) మూడో రోజు – అన్నపూర్ణా దేవి – పసుపు రంగు చీర – దద్దోజనం లేదా కట్టె పొంగలి
4) నాలుగో రోజు – కాత్యాయనీదేవి – ఎరుపు రంగు చీర – బెల్లం అన్నం, అన్నం ముద్ద పప్పు
5) ఐదో రోజు మహాలక్ష్మీదేవి – గులాబీ రంగు శారీ – పూర్ణాలు, క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది
6) ఆరో రోజు – లలిత త్రిపుర సుందరీదేవి – ఆకుపచ్చ రంగు చీర – పులిహోర, పెసర బూరెలు
7) ఏడో రోజు – మహాచండీదేవి – ఎర్ర చీర – లడ్డూ ప్రసాదం
8) ఎనిమిదో రోజు – సరస్వతీ దేవి – తెలుపు రంగు చీర – పరమాన్నం, అటుకులు, బెల్లం, శనగపప్పు కొబ్బరి
9) తొమ్మిదో రోజు – దుర్గాదేవి – ఎరుపు రంగు చీర – గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు
10) పదవ రోజు – మహిషాసుర మర్ధినీ దేవి – ఎరుపు రంగు చీర – చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసం, పానకం
11) పదకొండవ రోజు – రాజరాజేశ్వరీ దేవి – ఆకుపచ్చ చీర – పులిహోర, గారెలు