Natural Star Nani

Natural Star Nani: నాని నుంచి మరో భారీ సర్ప్రైజ్?

Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చేసింది. తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్‌తో ఆయన కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘96’ వంటి ఎమోషనల్ హిట్ తీసిన ఈ దర్శకుడితో నాని కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకెళ్తున్న నానికి ఫ్యాన్ బేస్, నాన్ థియేట్రికల్ మార్కెట్ రెండూ బలంగా ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న నాని 2026లో ఆ చిత్రం తెరపైకి తెస్తున్నాడు. అంతకుముందు సుజీత్ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ డ్రామాకు కూడా రెడీ అవుతున్నాడు.

Also Read: Naga Vamsi: 2026లో ఎవరికీ ఛాన్స్ ఇవ్వను.. ట్రోలర్లకు సమాధానమిస్తా: నాగ వంశీ

ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. హృదయానికి హత్తుకునే సినిమాలతో పేరొందిన తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్, నానితో ఒక కొత్త కథాంశం చర్చించాడు. ఆ ఐడియా నానికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. ప్రేమ్ కుమార్ సినిమాలకు నాని ఎప్పట్నుంచో ఫ్యాన్ అని బహిరంగంగానే చెప్పాడు. అందుకే ఈ కాంబినేషన్‌పై టాలీవుడ్‌లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీద పడే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే నాని ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రేమ్ కుమార్‌కు విక్రమ్‌తో సహా మరికొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. ఇవి పూర్తయితే త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు. ఈ కొత్త కాంబో అభిమానులకు మరో భారీ ట్రీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *