Narendra Modi: స్వామి నారాయణ్ ఆలయ 200వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- కులం, మతం, భాష, పురుషుడు-స్త్రీ, గ్రామం-నగరం ప్రాతిపదికన సమాజాన్ని విభజించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. మనం అంతా కలిసి వారిని అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు.
Narendra Modi: గుజరాత్‌లోని వడ్తాల్ ధామ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ – వేల సంవత్సరాల నాటి మన వారసత్వ కేంద్రాల వైభవం తిరిగి వస్తోంది. ధ్వంసమైందని అందరూ అనుకున్నది ఇప్పుడు ప్రత్యక్షమవుతోంది అని చెప్పారు. కాశీ, కేదార్‌నాథ్ ఆలయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇక్కడ నుంచి దొంగిలించి తీసుకుపోయిన వందల ఏళ్ల నాటి విగ్రహాలను విదేశాల నుంచి తిరిగి తీసుకురావడంపై కూడా ప్రధాని ఈ సందర్భంగా చర్చించారు.
అయోధ్య ను ఉదాహరణగా చెబుతూ 500 సంవత్సరాల తర్వాత ఒక కల నెరవేరింది. అంటే 500 సంవత్సరాలుగా ఎన్నో తరాలు ఆ కలను కన్నయి. వారు దాని కోసం పోరాడారు. అవసరమైనప్పుడు త్యాగాలు కూడా చేశారు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Narendra Modi: స్థానిక ప్రజలు తయారు చేసిన వస్తువులను ప్రోత్సహించాలని ప్రధాని సంత్ సమాజాన్ని కోరారు. భారతీయ యువతకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దేశంలోనే కాదు ప్రపంచ అవసరాలను తీర్చేందుకు భారత యువత సిద్ధంగా ఉంది అంటూ ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
ప్రధాని మోదీ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే . .
భారతదేశం ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పటికప్పుడు ఒక మహర్షి, మహాత్ముడు జాతిని రక్షిస్తూ కనిపించారు. వందల ఏళ్ల బానిసత్వం తర్వాత దేశం బలహీనంగా మారిన సమయంలోనే స్వామి నారాయణుని రాక కూడా జరిగింది. అప్పుడు స్వామి నారాయణ్ , ఇతర సాధువులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. అది మన ఆత్మగౌరవాన్ని కూడా పెంచింది. మన గుర్తింపును పునరుద్ధరించింది.
స్వామి నారాయణ ఆలయానికి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా శాఖలు ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభం గురించి విదేశాలలో ఉన్న ప్రజలకు తెలియజేయాలని నేను సాధువులందరినీ అభ్యర్థిస్తున్నాను. కుంభ దర్శనానికి విదేశాల్లోని ప్రతి శాఖ నుంచి కనీసం 100 మందిని తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను .
గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని వడ్తాల్‌లో స్వామి నారాయణ్ ఆలయ 200వ వార్షికోత్సవాన్ని నవంబర్ 7 నుండి 15 వరకు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.200 వెండి నాణెం, స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంతో ప్రజలను అనుసంధానం చేయాలని స్వామినారాయణ కుటుంబానికి చెందిన సాధువులు , మహాత్ములకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.