Nara lokesh: డ్రైవర్ ను విధుల్లోకి తీసుకోండి.. మంచి మనసు చాటుకున్న నారా లోకేష్..

Nara lokesh: మరోసారి మంచి మనసు చాటుకున్నారు మంత్రి నారా లోకేష్. ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సు ముందు దేవర సినిమా పాటకు చిందులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అధికారులు దాకా వెళ్లడంతో డ్రైవర్ పై సస్పెన్షన్ విధించారు. విషయం తెలుసుకున్న మంత్రి డ్రైవర్ ను తెలుగు విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్ లో తెలిపారు మంత్రి. డాన్స్ బాగా చేశావు డ్రైవర్ అని మెచ్చుకున్నారు.

అసలేం జరిగిందంటే..

రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ ఠాణా నుంచి రావుతులపూడి నుంచి విద్యార్థులను తీసుకుని బస్సు తునికి ప్రయాణం మొదలయింది. అయితే, కోడూరు సమీపంలో సింగిల్ రోడ్డు ఉండడంతో.. అదే దారిలో రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ ఆగిపోయింది. దాంతో బస్సు అక్కడే ఆపేయడంతో ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు బస్సు ముందు దేవర సినిమా పాటలకు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోకు మంత్రి నారా లోకేష్ డ్యాన్స్ అదరగొట్టారంటూ ట్వీట్ చేశారు. అయితే, డ్రైవర్ వీడియో బయటకు రావడంతో ఆర్టీసీ అధికారులు విచారణకు ఆదేశించారు. అందులో బస్సు ఎందుకు ఆగిందని?, డ్యాన్స్ వేసిన ఘటనపై ఆరా తీశారు. ఆ తర్వాత ఆయనను సస్పెండ్ చేసారు.ఈ నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బస్సును ఆపిందని లోవరాజు చెప్పారు. ఆ సమయంలో సరదాగా డాన్స్ చేసానని, డ్రైవింగ్ తన పని అని చెప్పాడు. అయితే ట్రాక్టర్ ఆగినప్పుడే బస్సును ఆపినట్లు ఆర్టీసీ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగించారని తెలుసుకున్న మంత్రి లోకేశ్‌ తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా మళ్లీ స్పందించారు. డ్రైవర్ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆదేశించారు.

https://x.com/naralokesh/status/1850219588124094615?t=D2cylhE2rCklHbrUx963tA&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *