Hit 3: నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునేలా ఉండబోతోందట.దర్శకుడు శైలేష్ కొలను ఈసారి కథను అందరికి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారని సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట.
ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది. అందుకే ఈ సినిమాలో హిందీలోనే మాట్లాడే ఒక క్యారెక్టర్ ని హైలెట్ చేస్తున్నారట. ఆ క్యారెక్టర్‌కు ఒక ప్రముఖ నటుడిని తీసుకున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సాకిబ్ అయూబ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని టాక్. ఈ స్టోరీలో మలుపులు మరింత థ్రిల్లింగ్‌గా ఉండబోతున్నాయి.
Also Read: Chiranjeevi-Anil Ravipudi: మెగాస్టార్ అనిల్ మూవీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
పైగా గత సినిమాల కంటే స్క్రీన్‌ప్లేని కొత్తగా ట్రై చేసినట్టు తెలుస్తోంది. సాకిబ్ ఈ సినిమా కోసం స్పెషల్‌గా వాయిస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. కచ్చితంగా ఈ సినిమా నానికి బాలీవుడ్ మార్కెట్ ని పెంచుతుందట. మరి విడుదలయ్యాక ఈ సినిమా ఏ విధంగా నానికి మార్కెట్ తీసుకొస్తుందో చూడాలి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలని తారాస్థాయికి పెంచేసింది.