Kk Mahender: సిరిసిల్ల అసెంబ్లీ స్థానంలో 2009 మార్చిలో జరిగిన ఎన్నికల్లో కేటిఆర్పైన కేకే మహేందర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి 171 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే బీఆర్ఎస్ టికెట్ ఆశించిన మహేందర్ రెడ్డి.. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. తరువాత బీఆర్ఎస్కి వ్యతిరేకంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.
శ్రీనివాస్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలలో మరోసారి కేటిఆర్‌పై కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. అప్పుడూ ఓటమి పాలయ్యారు. రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రెస్‌ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని రోజుల తరువాత మళ్లీ తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం 2018,2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లోనూ కేటిఆర్ చేతిలో ఓడిపోయారు. 2009 నుండి ఇప్పటివరకు కూడా కేటిఆర్‌కి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నారు కేకే. పదేండ్ల బీఆర్ఎస్ పాలనకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలోనే అధికారం వచ్చిన తరువాత కేకేకి ఎదైనా పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ ఎలాంటి పదవి రాకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
Also Read: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
Kk Mahender: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత ఇలాకా కావడంతో.. ప్రత్యర్థికి కూడా ఏదో ఒక పదవి ఉంటే ముందుకు సాగవచ్చన్న భావన వ్యక్తం అవుతోంది. ఈ పదిహేను నెలల కాలంలో నామినేట్ పొస్టులతో పాటు ఎమ్మెల్సీ పదవులు కూడా భర్తీ చేశారు. కానీ మహేందర్ రెడ్డికి ఎలాంటి పదవి రాలేదు. ఎమ్మెల్యే కోటా క్రింద భర్తీ చేసిన ఎమ్మెల్సీ పదవులలో కూడా కేకేకి అవకాశం రాలేదు.
దీంతో మహేందర్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో వివిధ రకాలు పొస్టులు పెడుతున్నారు. తమ నేతకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గత పదేండ్లుగా వివిధ కేసులతో ఇబ్బందులు పడ్డామని… ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డికి ఎదో ఒక పదవి ఇస్తే సిరిసిల్లలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి పదవి ఇస్తుందో వేచి చూడాలి మరి.
