Nani

Nani: వెంకీ అట్లూరితో నాని కొత్త చిత్రం.. తుది దశలో చర్చలు?

Nani: న్యాచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించిన ఈ ప్రాజెక్ట్ చర్చలు తుది దశకు చేరాయి. నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తే సితార బ్యానర్‌లో పట్టాలెక్కనుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Telangana: పుష్ప‌-2 తొక్కిస‌లాట కేసులో చార్జిషీట్‌

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 2026 నుంచి సుజిత్ దర్శకత్వంలో మరో యాక్షన్ డ్రామా ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో వెంకీ అట్లూరితో నాని ఒక సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. వెంకీ అట్లూరి గతంలోనే నానికి స్క్రిప్ట్ వినిపించారు. ప్రస్తుతం ఆ చర్చలు తుది దశకు చేరుకున్నాయి. నాని అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతా కుదిరితే సుజిత్ సినిమా పూర్తయిన వెంటనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ చిత్రం స్టార్ట్ అవుతుంది. మరోవైపు వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం మే 2026లో విడుదల కానుంది. నాని ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్‌తో కూడా మరో సినిమా చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారిక ప్రకటనలు రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *