The Paradise

The Paradise: షాకిస్తున్న ‘ది ప్యారడైజ్’ బడ్జెట్?

The Paradise: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో కలిసి ‘ది ప్యారడైజ్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే 200 కోట్లు దాటినట్లు టాక్ నడుస్తోంది. మార్చి 26 విడుదలకు ప్లాన్ చేసినా షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. నాని ‘జడల్’ పాత్రలో విభిన్న లుక్‌తో కనిపిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్, కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Also Read: Mrunal Thakur: మాజీ ప్రేమికుడ్ని వదిలేశాను.. కారణం ఇదే – మృణాల్ షాకింగ్ కామెంట్స్!

నాని కెరీర్‌లో ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాగా ‘ది ప్యారడైజ్’ నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్ల ప్రకారం ఈ యాక్షన్ డ్రామా బడ్జెట్ ఇప్పటికే 200 కోట్లు దాటిందట. మొదట్లో 150 కోట్లతో ప్లాన్ చేసినా షూటింగ్ ఖర్చులు, ప్రొడక్షన్ విలువలు పెరగడంతో ఇప్పుడు బడ్జెట్ భారీగా పెరిగిందని సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ చిత్రం సాగుతోంది. ఇప్పటివరకు నాని లుక్స్, గ్లింప్స్, మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యాయి. వీటిలో రగ్డ్, ఇంటెన్స్ లుక్‌తో నాని ఆకట్టుకుంటున్నాడు. ‘దసరా’ టీమ్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విడుదల తేదీ మార్చి నుంచి జూన్ వరకు వాయిదా పడే చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *