Nallagonda: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. మానవత్వం చూపినందుకు దాడి జరిగింది. లిఫ్ట్ అడిగినందుకు ఎక్కించుకున్న పాపానికి ఆ కారు యజమానిపై దుండగుడు దాడి చేసి గాయపర్చాడు. అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ లాక్కునేందుకు విఫయత్నం చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రం సమీంపలో చోటుచేసుకున్నది.
Nallagonda: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఇమ్రాన్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం తన కారులో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో నార్కట్‌పల్లి మండల కేంద్రం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. కాదనలేక మానవత్వం చూపాడు. అతడిని కారులో ఎక్కించుకున్న ఇమ్రాన్ బయలుదేరాడు. సాయం చేస్తున్న అనే ఫీలింగ్‌తో హైదరాబాద్ వైపు వెళ్లసాగాడు.
Nallagonda: కొద్ది దూరంలో చిట్యాల మండల కేంద్రం సమీపంలోకి చేరుకోగానే.. ఆ గుర్తు తెలియని వ్యక్తిలో ఉన్న దొంగ బయటకొచ్చాడు. ఇమ్రాన్ మెడ, శరీరంపై కత్తితో దాడి చేశాడు. అతని సెల్‌ఫోన్, నగదును లాక్కునేందకు ఆ దుండగుడు ప్రయత్నించాడు. ఈ సమయంలో తీవ్రంగా ప్రతిఘటించిన ఇమ్రాన్ తీవ్రగాయాలపాలయ్యాడు. కారు ఆగిపోగానే భయంతో ఆ నిందితుడు దిగి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఇమ్రాన్‌ను స్థానికులు చూసి 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
