Nagarjuna-CM Chandrababu

Nagarjuna-CM Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున – అఖిల్ వివాహానికి ఆహ్వానం

Nagarjuna-CM Chandrababu: తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ప్రముఖ కుటుంబంగా నిలిచిన అక్కినేని కుటుంబం త్వరలో జరిగే శుభకార్యానికి రంగం సిద్ధం చేస్తోంది. యువ హీరో అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనాబ్ రవ్జీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా, నాగార్జున, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీ గుంటూరులోని ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అఖిల్ వివాహానికి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తూ ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇద్దరూ కొద్ది సేపు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.

అఖిల్, జైనాబ్ మధ్య కొన్నాళ్లుగా ప్రేమ సాగుతోంది. వారి నిశ్చితార్థం గత సంవత్సరం నవంబర్ 26న, ఇరుకుటుంబాల సమక్షంలో వైభవంగా జరిగింది. అప్పటినుంచి ఈ జంట పెళ్లి గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Also Read: Sreeleela: శ్రీలీల.. ఫ్రీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్! ఇలా కూడా చేస్తారా!

Nagarjuna-CM Chandrababu: వివాహ వేడుక జూన్ 6, 2025న జరగనుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వేదిక కానుంది. అక్కినేని నాగార్జున ఈ వేడుక కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సినీ, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సీఎం చంద్రబాబుతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *