Nagabandham: ‘పెద కాపు -1’తో తెలుగువారి ముందుకు హీరోగా వచ్చాడు విరాట్ కర్ణ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో దానికి సీక్వెల్ రావాల్సింది రాలేదు. అయితే ఇప్పుడు విరాట్ కర్ణ ‘నాగబంధం’ అనే మూవీ చేస్తున్నాడు. దీనిని ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ నామాతో కలిసి కిశోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న రుద్రను పరిచయం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Pm modi: విశాఖ హార్బర్ ను మరింత అభివృద్ధి చేస్తాం..
Nagabandham: నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘నాగబంధం’లో జగపతి బాబు, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుండి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో అభిషేక్ నామా ఈ స్క్రిప్ట్ ను రాసుకున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘నాగబంధం’ ఇదే యేడాది తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధంగా వుంది.

