Vrushakarma Trailer

Vrushakarma Trailer: మైండ్ బ్లాక్ చేస్తున్న నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్..!

Vrushakarma Trailer: అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వృషకర్మ’ (Vrushakarma) ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది! వాస్తవానికి బుధవారం (నవంబర్ 25) నెల్లూరులో జరిగిన ఈవెంట్‌లో బిగ్ స్క్రీన్‌పై ట్రైలర్ ప్రదర్శించినప్పటికీ, సోషల్ మీడియా రిలీజ్ సమయంలో టెక్నికల్ గ్లిచ్ రావడంతో వాయిదా పడింది.

తాజాగా గురువారం (నవంబర్ 26, 2026) ఉదయం మేకర్స్ ఈ ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేయగా, విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రైలర్ చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు “ట్రైలర్ మామూలుగా లేదు, ఇమాజినేషన్‌కు అందకుండా నెక్స్ట్ లెవల్‌లో ఉంది, చైతూ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయం” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ట్రైలర్ కథాంశం, విజువల్స్ విషయానికొస్తే.. పురాతన తవ్వకాల్లో బయటపడిన ఒక అతీంద్రియ శక్తి భూమిపై వినాశనం సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే, దానిని అడ్డుకోవడానికి హీరో రంగంలోకి దిగే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని స్పష్టమవుతోంది. ‘విరూపాక్ష’ సినిమాలో కాకులతో ఆడియన్స్‌ను భయపెట్టిన దర్శకుడు కార్తీక్ దండు, ఈసారి గబ్బిళాలతో వణుకు పుట్టించబోతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. గబ్బిళాల ద్వారా ఓ చిన్నారి శరీరంలోకి ఏదో తెలియని శక్తి ఆవహించడం, మనిషే కాని ఓ వింత శక్తి భూమిపైకి రావడం వంటి సన్నివేశాలు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతిని కలిగిస్తున్నాయి.
ఇందులో మిస్టరీ, సస్పెన్స్, హారర్ మరియు మైథాలజీ అంశాలను అద్భుతంగా మేళవించారు.
ముఖ్యంగా ట్రైలర్‌లో వినిపించే పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. “మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చబోతున్న ఓ అతీంద్రియ శక్తి.. ఈ భూమిపై తిష్టవేసింది”, “మనకు అందని సైన్స్ సార్ వాళ్లది.. వేదిక్ సైన్స్” అని నాగచైతన్య చెప్పే డైలాగ్స్ వేదాల ప్రాముఖ్యతను, రహస్య శక్తులను సూచిస్తున్నాయి. ఇక చివర్లో “సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం సాక్షాత్తు ఆ దైవమే ఎంచుకున్న వృషకర్మవి నువ్వే” అనే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. అజనీశ్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు ప్రాణం పోసింది.
ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటించగా, జయరాం, స్పర్ష్ శ్రీవాత్సవ, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ‘వృషకర్మ’ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
Vrushakarma Trailer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *